Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్‌బుక్ లైవ్ ద్వారా 'ప‌ద్మావ‌త్' సినిమా లీక్‌... వైర‌ల్‌గా మారిన పోస్ట్‌

  • లైవ్ నిర్వ‌హించిన 'జాతోంకా అడ్డా' అనే పేజీ
  • 3.5 ల‌క్ష‌ల‌కు పైగా వీక్ష‌ణ‌లు
  • 15వేల‌కి పైగా షేర్లు
ఓ వైపు ఆంక్ష‌లు, వివాదాల మ‌ధ్య ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ 'ప‌ద్మావ‌త్' సినిమాను విడుద‌ల చేస్తే... మ‌రో వైపు కొంత‌మంది నెటిజ‌న్లు ఆన్‌లైన్‌లో సినిమా పైర‌సీని మొద‌లు పెట్టేశారు. ఏకంగా థియేట‌ర్ నుంచి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా సినిమాను ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. 'జాతోంకా అడ్డా' అనే ఫేస్‌బుక్ పేజీ ప‌ద్మావ‌త్ సినిమాను ఫేస్‌బుక్‌లో లైవ్ ద్వారా ప్ర‌సారం చేసింది.

ఈ మేర‌కు వారు చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే దాదాపు 15వేల మందికి పైగా నెటిజ‌న్లు ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా 3.5 ల‌క్ష‌ల మందికి పైగా ఈ లైవ్‌ను వీక్షించారు. సినిమా విడుద‌ల చేసినందుకు కర్ణిసేన బ‌స్సులు, థియేట‌ర్ల‌ను ధ్వంసం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో థియేట‌ర్ల‌లో చూడ‌డానికి 50 శాతం మంది కూడా రావ‌డం లేదు. అలాగే ఈ సినిమా గురించి ఇప్ప‌టికే మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇలా పైర‌సీ వీడియో ప్ర‌త్య‌క్షం కావ‌డం నిర్మాత‌ల‌కి భారీ న‌ష్టాలు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
facebook
Padmaavat
leak
live
sanjay leela bhansali

More Telugu News